రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండెం దొరబాబు గారు. ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చర్చించారు. జనసేన చేరేందుకు శ్రీ దొరబాబు గారు ఆసక్తి వ్యక్తం చేయగా అందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంగీకారం తెలిపారు.