కర్నూలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. పెన్షన్ లబ్దిదారులకు శాశ్వతంగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ డబ్బులు అందిస్తామని స్పష్టం చేశారు.కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ను రూ.4 వేలకు పెంచామని గుర్తు చేశారు. ఒకటో తేదీన అధికారులు మీ ఇంటికొచ్చి పింఛను ఇస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రక్రియ ఇకపై కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.