ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBI)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (MOU) చేసుకుంది. ప్రస్తుత వ్యవస్థలో నైపుణ్య అంతరాలను గుర్తించి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను అమలుచేసేందుకు ఏపీ ప్రభుత్వంతో టిబిఐ కలసి పనిచేస్తుంది.
ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఫిజిక్స్ వాలా (PW) ఎడ్యుటెక్ కంపెనీ తన పరిశ్రమ భాగస్వామి అమెజాన్ వెబ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో AI-ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (IoE)… యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ (UoI)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇన్నోవేషన్ యూనివర్సిటీ అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్స్ ను ఏకీకృతం చేసే దిశగా పని చేస్తుంది. పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది.