అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్దమవుతున్న విజయ్. వచ్చే నెల డిసెంబర్ లో విజయ్ రాష్ట్ర పర్యటన ఉంటుంది సమాచారం. తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించి నూతన ప్రయాణం మొదలుపెట్టిన నటుడు విజయ్ దళపతి ఆపార్టీ కీలక నాయకులతో సమావేశం అయ్యారు. తమిళగ వెట్రి కజగం పార్టీ ముఖ్యనేతలతో పాటు సలహాదారులు ఈ భేటీకి హాజరయ్యారు.

త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోకా పార్టీని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తమ పార్టీ విధి విధానాలను ప్రజలకు ఎలా వివరించాలనే దానిపై ప్రధానంగా చర్చింనట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతల సూచనలు, సలహాలతో పాటు విజయ్ తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించడం జరిగింది.

విజయ్ డిసెంబర్ లో చేపట్టబోయే స్టేట్ టూర్ కి సంబంధించిన రోడ్ మ్యాప్ ఖరారు చేసే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. విజయ్ ఫ్రెండ్ తమిళగ వెట్రి కజగం పార్టీ ప్రధాన కార్యదర్శి , పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే బుస్సీ ఆనంద్ తో పాటు పార్టీ సీనియర్ నేతలతో విజయ్ సమావేశమై తన పర్యటనపై చర్చించినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.

విజయ్ వచ్చే నెల 2వ తేది నుంచి తన యాత్రను మొదలుపెట్టబోతున్నట్లుగా సమాచారం. డిసెంబర్ 2న కోయంబత్తూరులో ప్రారంభమయి డిసెంబర్ 27న తిరునెల్వేలిలో భారీ బహిరంగ సభతో ముగుస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసే పనిలో పార్టీ శ్రేణులు, కీలక నేతలు బిజీ ఉన్నారు. ఈ 25 రోజుల రాష్ట్ర వ్యాప్త పర్యటనలో విజయ్ ప్రజల సమస్యలు ఆలకించడంతో పాటు ఆయన రాష్ట్రంలో చేపట్టబోయే పనులు, రాజకీయ నిర్ణయాలను ప్రజలకు నేరుగా వివరించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాలో బలంగా ఉన్న జాతీయ, స్థానిక పార్టీలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తనకున్న అభిమాన బలం సరిపోదని భావించే విజయ్ ఈవిధంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు రెడీ అయినట్లుగా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. విక్కరవండిలో జరిగిన బహిరంగ సభ ద్వారా పార్టీని ప్రకటించడమే కాకుండా ప్రత్యర్థులు, రాజకీయ పార్టీలపై తనదైన శైలీలో సెటైర్లు వేసిన విజయ్ తన పార్టీ ద్రావిడ, తమిళ జాతీయవాదాల సమ్మేళనంగా అభివర్ణించారు.