సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రిజల్ట్ కేంద్రం కేటాయింపుల్లో కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం నిధులను విడుదల చేసింది. మొత్తం రూ. 988.773 కోట్లు రాష్ట్రంలోని పంచాయతీలకు అందించాయి. ఈ నిధులు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ద్వారా విడుదల చేయబడ్డాయి.
అన్‌టైడ్ గ్రాంట్ కింద రూ. 395.5091 కోట్లు, టైడ్ గ్రాంట్ కింద రూ. 593.2639 కోట్ల నిధులకు కేంద్రం ఏపీకి కేటాయించింది. ఈ నిధులు రాష్ట్రంలోని 9 జెడ్పీలు, 615 మండల పంచాయతీలు, 12,853 గ్రామ పంచాయతీలకు వర్తిస్తాయి.
అన్‌టైడ్ గ్రాంట్ వినియోగం నిధులను వ్యవసాయం, గ్రామీణ గృహనిర్మాణం, పారిశుద్ధ్యం, విద్య వంటి అంశాల కోసం ఈ నిధులను వినుయోగించవచ్చు.
టైడ్ గ్రాంట్ వినియోగం: ఈ నిధులను నీటి యాజమాన్యం, వాననీటి సంరక్షణ, పారిశుద్ధ్యం, మురికినీటి రీసైక్లింగ్ వంటి మౌలిక సదుపాయాల కోసం వినుయోగించవచ్చు.
అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం పల్లెపండగ వారోత్సవాల్లో భాగంగా గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కంకిపాడులో పాల్గొననున్నారు.