ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌ 16 సిరీస్‌ను విడుదల చేసింది. ‘ఇట్స్‌ గ్లోటైమ్‌’ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో 16 సిరీస్‌ ఫోన్లతో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10, ఎయిర్‌పాడ్స్‌ 4ను లాంచ్ చేసింది.

సోమవారం కాలిఫోర్నియాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సీఈవో టిమ్‌ కుక్‌ ఈ ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సరికొత్త ఈ ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. యాపిల్ ఐఫోన్ 16తో పాటు ఇతర ఉత్పత్తులను ‘గ్లోటైమ్’ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఈ ఫోన్లను ప్రీఆర్డర్ చేసుకునే అవకాశం ఉండగా.. 20వ తేదీ నుంచి కొనుగోలు చేయొచ్చు.

ఈ ఐఫోన్ 16 లో కొత్తగా యాపిల్ ఇంటెలిజెంట్ అనే ఒక యాప్ తీసుకుని వచ్చారు దీని ద్వారా ఏదైనా కంపెనీ గురించి మనము సెర్చ్ చేస్తే ఆ కంపెనీ బ్లాగ్స్, దాని పూర్తి వివరాలు మనకు అందించే ఫీచర్స్‌తో ఈ ఐఫోన్ 16 యాపిల్ ఇంటెలిజెంట్ యాప్లో ఉంది. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు.