జియో ట్యాగ్ గోను ఎట్టకేలకు రిలయన్స్ జియో లాంచ్ చేసింది. జియో ట్యాగ్ గో గూగుల్ ఫైండ్ మై డివైజ్ నెట్‌వర్క్‌తో పనిచేసే కాయిన్-సైజ్ బ్లూటూత్ ట్రాకర్ . ఈ విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించుకున్న భారతదేశంలో మొట్టమొదటి ట్రాకర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో జియో ట్యాగ్ గో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
జియో ట్యాగ్ గో గూగుల్ ఫైండ్ మై డివైజ్ యాప్‌ని ఉపయోగించి వినియోగదారులు తమ వస్తువులను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయడానికి అనుమతి ఉంటుంది. జియో ట్యాగ్ గో అమెజాన్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. జియో ట్యాగ్ గో ధర రూ. 1,499గా నిర్ణయిచగా, నలుపు, తెలుపు, ఆరెంజ్, పసుపు రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటుంది. జియో వెబ్‌సైట్ ప్రకారం ఈ డివైజ్ సమీపంలోని ఆండ్రాయిడ్ డివైజ్‌లను ఉపయోగిస్తుంది. జియో ట్యాగ్ గో ట్రాకర్ బ్లూటూత్ పరిధిలో లేనప్పుడు కూడా లొకేషన్ అప్‌డేట్‌లను అందిస్తుంది. వినియోగదారులు తమ విలువైన వస్తువులను ఎక్కడున్నా వర్చువల్‌గా గుర్తించవచ్చు.
జియో ట్యాగ్ గో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న గూగుల్ ఫైండ్ మై డివైజ్ యాప్ ద్వారా ఏదైనా ఆండ్రాయిడ్ డివైజ్‌లతో పెయిర్ చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. గూగుల్ ఫైండ్ మై డివైజ్ నెట్‌వర్క్‌లోని మిలియన్ల కొద్దీ ఆండ్రాయిడ్ వినియోగదారులు జియో ట్యాగ్ గో వాడవచ్చు. అలాగే ఒకసారి పెయిర్ చేసిన తర్వాత మీ ముఖ్యమైన వస్తువులకు జియో ట్యాగ్ గోను అటాచ్ చేస్తే చాలాు మీరు వాటిని ఎక్కడ ఉన్నా సులభంగా ట్రాక్ చేయవచ్చు. జియో ట్యాగ్ గోను కీలు, వాలెట్లు, పర్సులు, సామగ్రి, గాడ్జెట్లు, బైక్‌లు, మరిన్నింటికి జోడించవచ్చు.