భూ సమస్యలతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, పథకాలు ఇప్పించాలని మరికొందరు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలకు ఆశాకిరణంలా కన్పిస్తున్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రవ్యాప్తంగా తరలివస్తున్న బాధిత ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తున్నారు యువనేత లోకేష్. ఉండవల్లి నివాసంలో 52వరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కు వినతులు వెల్లువెత్తాయి. మంత్రి లోకేష్ ను కలుస్తున్న వారిలో వైసీపీ పాలనలో భూ బాధితులే అధికంగా ఉంటుండటంతో రెవిన్యూ, పోలీసు అధికారులు సమన్వయంగా సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిగా అధికారులను ఆదేశించారు.