- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకి విశాఖ నుంచి బయలుదేరారు.
- వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా ముందుగా నిర్ణయించుకు ప్రకారం – గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటనకి బయలు దేరారు.
- సాలూరు నియోజకవర్గం పనసభద్ర పంచాయతీ బాగుజోలకు వెళ్తారు.
- మన్యం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
- 19 నూతన రోడ్లకు శంకుస్థాపనలు
- దాదాపు 36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం
- రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డొలీల బాధల నుండి విముక్తి .