పెనమలూరు నియోజకవర్గం, గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహన్ గారు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్ళలో రైతుల సమస్యల పరిష్కారానికి నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. గంగూరులో రైతు సేవాకేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి, ఆ పక్కనే ఉన్న వెంకటాద్రి ధాన్యం మిల్లును తనిఖీ చేసారు. సిబ్బంది, రైతులు, అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.