రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రి ఒకటి. ఈ నెల 15న గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఆలయ దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిలో ప్రత్యేక కార్యక్రమాలు విజయవాడ దుర్గాదేవి ఆలయ దేవస్థానం నిర్వహిస్తోంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున స్వామి అమ్మవార్లకు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా, విజయవాడ ఇంద్రకీలాద్రిలో శ్రీ దుర్గాదేవి అమ్మవారి గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఆలయ దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. విజయవాడలోని ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ గిరి ప్రదక్షిణ ఉదయం 6 గంటలకు ప్రారంభమై 9 గంటలకు ముగుస్తుందని దేవస్థానం తెలిపింది. ఐదున్నర గంటల సమయంలో ఇంద్రకీలాద్రి కొండ దిగువన అమ్మవారి రథం ఉంచబడుతుంది. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తులు కూడా ఈ గిరి ప్రదక్షిణలో దర్శనం ఇస్తారు