వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్ : ప్రస్తుతం వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు పేరుతో కొత్తరకం మోసాలు మొదలు అయ్యాయి. అసలే రకరకాల స్కామ్ కాల్స్, అన్‌లైన్ మోసాలతో ప్రజలు ఇబంది అవుతుంటే మరో మోసం మొదలు అయింది . స్కామర్లు వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్‌ను కొత్తగా ఎంచుకుని తెలుగు రాష్ట్రాల్లో మోసాలకు తెర లేపుతున్నారు. ఈ స్కామ్‌లో మొదట మీ వాట్సప్‌కి ఓ వివాహానికి ఆహ్వానం అంటూ సందేశాత్మకమైన PDF లేదా APK ఫైళ్లుగా వస్తుంది. ఒకసారి ఈ ఫైల్ డౌన్లోడ్ చేసిన తరువాత అది మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. దీని ద్వారా హ్యాకర్లకు మీ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేస్తారు. మీ ఆన్‌లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి అవకాశం దోరుకుతుంది. దాంతో మీ వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి వెళ్లే అవకాశం ఉంది లేదా కొత్తరకం సాఫ్ట్‌వేర్ వైరస్‌లను మన మొబైల్ లేదా కంప్యూటర్‌లోకి పంపిస్తారు. కానీ మనకి ఈ విషయం తెలీదు.

ఈ స్కామ్ భారి పడకుండా సురక్షితంగా ఉండడానికి అనుమానం వచ్చినప్పుడు అజ్ఞాత నంబర్ల నుంచి వచ్చిన ఫైళ్లను ఓపెన్ చేయకండి. ఒకవేళ సైబర్ ఫ్రాడ్‌కి గురి అయితే వెంటనే 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కి కాల్ చేయండి లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి. జాగ్రత్తగా ఉండండి.