వరద సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు ఖర్చు చేసారంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ:ధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ తీవ్రంగా ఖండించింది.
వరద సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు ఖర్చు చేసారంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సర్కార్ తీవ్రంగా స్పందించింది. కొందరు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలకు పూనుకుంటున్నారని ఖండించింది. ఏపీ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ ప్రచారాలని కొట్టిపారేశారు. కొంతమంది ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డరు.
విజయవాడలో వరదల కారణంలో వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా లేక రాత్రిళ్లు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వారికి రాత్రి సమయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా మొబైల్ జనరేటర్లు తలరించి సహాయక చర్యలు చేపట్టామని ఆయన వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్నట్లుగా కేవలం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీకి రూ.23 కోట్లు వెచ్చించామనడం పూర్తిగా నిరాధారమైందని సిసోడియా కొట్టిపారేశారు. ఈ ఖర్చు ప్రధానంగా మొబైల్ జనరేటర్ల కోసం వెచ్చించిందని తెలిపారు. దీంతో పాటు వరద బాధితులకు అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు కూడా అదనంగా అందించామని స్పస్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచాలను ప్రజలు ఏమాత్రం విశ్వసించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.