నేడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే రోజు. విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోదీ గారు, రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ లకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విశాఖలోని సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానం వరకు ప్రధాని రోడ్ షో లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటారు.