బిల్డింగ్‌ ది నెక్ట్స్ పెట్రోకెమికల్ హబ్ అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ చర్చలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. పోర్టులు, లాజిస్టిక్స్, స్కిల్డ్ టాలెంట్.. అన్నిటికీ ఏపీ కేరాఫ్ ఐందన్నారు. టెక్నాలజీ గ్లోబల్ లీడర్‌గా ఉన్న కాగ్నిజెంట్ సంస్థ సీఈఓ ఎస్. రవికుమార్‌తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ఏపీ బెటర్ ప్లేస్ అని చెప్పారు. తర్వాత.. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన టెక్నలాజికల్ ఎడ్వాన్స్‌మెంట్‌ను వివరించారు. నిపుణులైన యువత ఉన్న ఏపీ.. ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ కాబోతోందని చెప్పారు. తర్వాత టెక్ దిగ్గజం బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు. అప్పుడు ఐటీ కోసం, ఇప్పుడు ఏఐ కోసం మేమిద్దరం అంటూ గత జ్ఞాపకాల్ని షేర్ చేసుకున్నారు. బిల్‌ గేట్స్‌ని మళ్లీ కలుసుకోవడం ఆహ్లాదకరం అన్నారు సీఎం చంద్రబాబు.

హిటాచీ ఇండియా ఎండీ భరత్‌ కౌశల్‌తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. హెచ్‌వీడీసీ సాంకేతికత అమలులో సహకరించాలని కోరారు. WTCA గ్లోబల్‌ చైర్మన్ జాన్‌ డ్రూతో సమావేశమై.. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల ఏర్పాటు చేయాలని విన్నవించారు. టెమాసెక్‌ హోల్డింగ్స్‌ భారత్‌ హెడ్‌ రవి లాంబాతో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని, విశాఖ, తిరుపతిలో కమర్షియల్‌ స్పేస్‌ ఏర్పాటు చేయాలని కోరారు.