విజయవాడలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో గౌరవ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఐటీ, హెచ్ ఆర్ డి మంత్రి శ్రీ నారా లోకేష్ గారు పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే పరేడ్ శకటాల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శకటానికి తృతీయ స్థానం దక్కింది. గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారి నుంచి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారు, కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారు పురస్కారం స్వీకరించారు