హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 298 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 164/7 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 133 పరుగుల తేడాతో విజయం సాధించింది.
చివరి టీ20 విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మాన్ అఫ్ ది మ్యాచ్ సంజు శాంసన్ , మాన్ అఫ్ ది సిరీస్ హార్దిక్ పాండ్య ఎన్నికయ్యారు.