బంగ్లాదేశ్ తో కాన్పూర్లో జరిగిన రెండవ టెస్టులో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
బంగ్లాదేశ్ జట్టును రెండవ ఇన్నింగ్స్ లో కేవలం 146 పరుగులకే కట్టడి చేసి, 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని చేధించింది. యశస్వి జైస్వాల్ (51), విరాట్ కోహ్లీ (29*) నిలకడగా ఆడి జట్టుకు విజయం అందించారు.
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా యశస్వి జైస్వాల్, ప్లేయర్ అఫ్ ది సిరీస్ గా రవిచంద్రన్ అశ్విన్ ఎన్నికయ్యారు.