పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 238 పరుగులకే కుప్పకూలింది. నాల్గవ రోజు ఆట ప్రారంభమైనప్పటికే మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లో ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. అయితే టీమిండియా టాప్ బౌలర్లు ఆస్ట్రేలియా జట్టును కేవలం 104 పరుగులకే ఆలౌట్ చేసారు. దీంతో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం దక్కింది.
ఇక రెండో ఇన్నింగ్స్ ను స్లోగా మొదలు పెట్టిన టీమిండియా ఓపెనర్స్ కాస్త ఓపికగా ఆడుతూ, మొదటి వికెట్ కు 201 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇంకా టీమిండియా రెండో ఇన్నింగ్స్ ను 6 వికెట్లు కోల్పోయి 487 పరుగులకు డిక్లెర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో జైస్వాల్, విరాట్ కోహ్లీలు శతకాలు సాధించారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాధించడంతో ఆస్ట్రేలియాకు 533 పరుగుల భారీ లక్ష్యం వచ్చింది. ఈ నేపథ్యంలో మూడో రోజు చివరి సెషన్లో ఆట మొదలు పెట్టిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక నాల్గొవ రోజు కూడా ఆస్ట్రేలియా బ్యాటమెన్స్ వికెట్ల వరుసగా కోల్పోయింది. భారత బౌలర్లలో బుమ్రా 3, సిరీజ్ 3 వికెట్లు, సుందర్ 2, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తీశారు. ఈ విక్టరీతో 2 టెస్టుల సిరీస్ లో టీమ్ ఇండియా 1-0 లీడ్ లోకి వెళ్లింది. ఇక డిసెంబర్ 6న రెండో టెస్టు పింక్ బాల్ టెస్టు అడిలైడ్ వేదికగా జరగనుంది.
ప్రకటనలు