మార్నింగ్ వాక్ చెయ్యడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. నడక వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి. రక్తపోటు తగ్గుతుంది. ఎముకలు, కండరాలు పటిష్టంగా మారతాయి. బరువు తగ్గడానికి ఇదొక మంచి మార్గం అని డాక్టర్లు చెబుతున్నారు.

ఉదయం నడక రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. గంటకు 6.4 కి.మీ వేగంతో రోజూ 30 నిమిషాల పాటు నడవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.