అమెరికా హెచ్చరించినట్లుగానే పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ ఇజ్రాయెల్‌పై ప్రతీకార చర్యలకు తెగబడింది. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ బాంబుల మోతతో దద్దరిల్లింది.ఓ వైపు లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా.. మరోవైపు ఇరాన్ సైతం రంగంలోకి దిగింది.

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాదాపు 100 క్షిపణులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడుల తరువాత, ఇజ్రాయెల్‌ దేశవ్యాప్తంగా సైరన్లు మోగాయి. ప్రజలు అప్రమత్తం అయ్యారు.దీంతో ఇజ్రాయోల్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.