దేశ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని గతంలోనే ప్రకటించగా, తాజాగా తన పార్టీ పేరును అధికారికంగా వెల్లడించారు.గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఆయన తన రాజకీయ పార్టీ ‘జన్ సురాజ్’ను ప్రారంభించారు.

ఈ సందర్భంలో ప్రశాంత్ కిశోర్ ఆయన పార్టీ శ్రేణులతో “జై బిహార్” నినాదాలు చేయించారు. బిహారీ ప్రజలపై జరుగుతున్న వేధింపులు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వినిపించేలా ఈ నినాదాలు ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.