హాస్పిటల్ కి వచ్చేవారు, ఆర్టీసీ కాంప్లెక్స్ కు వచ్చే ప్రయాణికులు, ఒక పూటకి భోజనం కొనాలంటే 80 రూపాయల నుండి వంద రూపాయల వరకు హోటల్ లో భోజనం ధరలు ఉన్నాయి. ఇలాంటి ధరలు ఉన్నప్పుడు మధ్య తరగతి ప్రజలకు భోజనం కొనుక్కొని తినాలంటే చాలా కష్టమవుతుందని ఈ అన్న క్యాంటీన్ వల్ల ఐదు రూపాయలకే భోజనం లభిస్తుంటే చాలా సంతోషం కలుగుతుందని అన్న క్యాంటీన్‌కు వచ్చిన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. . ఉదయం నుండి రాత్రి వరకు మూడు పూటలా అన్న క్యాంటీన్ ఆకలి తీరుస్తుంది. ఉదయం ఇడ్లీ, ఉప్మా, పూరి, పొంగలి ఉంటుంది. మధ్యాహ్నం అన్నం, సాంబార్, కూర, పెరుగు, పచ్చడి ఉంటుంది. రాత్రికి అన్నం, సాంబార్, పెరుగు, పచ్చడి ఉంటుందని వారంలో ఆదివారం మినహా మిగతా అన్ని రోజులు అన్న క్యాంటీన్ ఉంటుంది.