అన్యమతస్థులు దేవాలయ ప్రవేశం లేదని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అన్యమతస్థులు, హిందూ ధర్మంపై నమ్మకం లేని వారికి దేవాలయ ప్రవేశం ఎందుకని ప్రశ్నించింది.
అంతే కాకుండా అన్యమతస్థులు హిందూ దేవాల యాలలోకి ప్రవేశించాలంటే మాత్రం తప్పని సరిగా డిక్లరేషన్ ఇచ్చి తీరాలని విస్పష్ట తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంగా హిందూదేవాలయాలు పిక్నిక్ స్పాట్ లు కావని వ్యాఖ్యానించింది. అవి పవిత్రతకు నిలయాలని పేర్కొంది. తమిళనాడులోని ప్రసిద్ధిచెందిన అరుల్మిగు పళని దండాయుతపాణి స్వామి ఆలయం, దాని ఉప ఆలయాల్లోకి కేవలం హిందువులకు మాత్రమే అనుమతించాలంటూ దానికోసం ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డి సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ ను వ విచారించిన మద్రాసు హైకోర్టు.. డిక్లరేషన్ ఇవ్వకుండా అన్యమతస్థులకు దేవాలయాల్లో ప్రవేశం లేదని తీర్పు ఇచ్చింది. ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన పెద్ద ఇష్యూగా మారింది. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. తాను డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి, ఇదేం సెక్యులరిజం అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో వేరే కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.