ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా లో అమలాపురం కేంద్రంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఏడాది పొడవునా మహిళలు అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. లోక కల్యాణార్థం ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు, ప్రత్యేక భజనలు, అమ్మవారి పారాయణాలు జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఆర్యవైశ్య మహిళలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి ప్రాంగణంలో అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి ప్రాంగణమంతా కరెన్సీ నోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.