గ్రామసభల ద్వారా గుర్తించిన సమస్యల పరిష్కారాలకు పల్లె పండుగ వారోత్సవాల ద్వారా బీజం పడింది.
ప్రజలు చేసుకున్న తీర్మానాలను సంక్రాంతి కల్లా పూర్తి చేయడానికి పనులు ప్రారంభమయ్యాయి. పారదర్శకమైన ప్రభుత్వంలో, ప్రజలకు జవాబుదారీగా నాయకులు పని చేస్తున్నారు
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మొదలైన ‘పల్లె పండుగ వారోత్సవాల’ కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్ పల్లెలను ప్రగతి పథంలోకి నడిపిస్తూ, గ్రామ స్వరాజ్యం సాధించే లక్ష్యంలో బలమైన తొలి అడుగుగా నిలిచింది.