మార్కెట్‌లో దొరికే కల్తీ నూనెల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల నూనె వాడకంలో జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
పూర్వం ఎద్దులను ఉపయోగించి స్వచ్ఛమైన గానుగ నూనె తయారు చేసేవారు. కాలక్రమేణా ఎద్దుల వినియోగం తగ్గిపోయి , యంత్రాలతో నూనెలు తయారు చేయడం మొదలైంది. అయితే, యంత్రాల ద్వారా తయారు చేసే నూనెల్లో ఎక్కువగా కల్తీ జరుగుతోంది. మన రోజువారీ జీవితంలో వంటనూనెలు అత్యంత ముఖ్యమైనవి అని మనకు తెలుసు . కానీ ఇవి చాలా వరకు కల్తీ అవుతున్నాయి. ఉదాహరణకు, ఒక కిలో పల్లి నూనె మార్కెట్లో రూ.120 నుండి రూ.150 వరకు దొరుకుతుంది. కానీ ఒక కిలో పల్లీల ఖరీదు మాత్రమే రూ.120 ఉంటుంది. 3 కిలోల పల్లీలు వేస్తేనే ఒక కిలో నూనె వస్తుంది. ఈ లెక్కన చూస్తే, మార్కెట్‌లో దొరికే నూనెల్లో ఎంత కల్తీ జరుగుతోందో మనకి స్పష్టంగా తెలుస్తుంది.
కరోనా తర్వాత చాలా మంది ప్రజలు తమ ఆరోగ్యాన్ని రక్షించుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో గానుగ నూనెలకు ఆదరణ పెరిగింది. గానుగ నూనెలు ఎద్దు గానుగ నూనె, మిషన్ గానుగ నూనె అనే రెండు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఎద్దు గానుగ ద్వారా తయారైన నూనెకు మార్కెట్‌లో దొరికే నూనెల కంటే ఎక్కువ ధర ఉంటుందని చెప్పారు. కారణం, మూడు కిలోల పల్లీలను ఉపయోగించి మాత్రమే ఒక కిలో నూనె వస్తుందని, ఈ ప్రాసెస్ లో ఎలాంటి కల్తీకి అవకాశం లేకుండా ఉంటుంది. దాని వల్ల ఈ నూనె ఖరీదు ఎక్కువగా ఉంటుంది . మార్కెట్‌లో దొరికే కల్తీ నూనెల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, ఎద్దు గానుగ నూనె వాడటం వల్ల ఇవి నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నూనె పూర్తిగా స్వచ్ఛమైనదిగా ఉంటుంది , దీనిని వాడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు . గుండె జబ్బుల ముప్పును తగ్గించడంలో కూడా ఈ నూనె ఎంతో ఉపయోగ పడుతుంది.