రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ కు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారితో కలిసి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
అనంతరం కేంద్రం నిధులు రూ. 375 కోట్లతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టనున్న ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు. గోదావరి తీరం రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టబోయే ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు, శ్రీ నిమ్మల రామానాయుడు గారు, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, శాసన సభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు,శ్రీ ఆదిరెడ్డి వాసు గారు, శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు, శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు, శ్రీ చిర్రి బాలరాజు గారు, శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ నూ కసాని బాలాజీ గారు, రుడా ఛైర్మన్ శ్రీ బొడ్డు వెంకట రమణ చౌదరి గారు, డిసిసిబి ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి గారు, జిల్లా, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రూ.430 కోట్లతో పర్యాటక ప్రాజెక్టులకు శంకుస్థాపన.
పర్యాటక రంగంలో మెండుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.
అఖండ గోదావరి ప్రాజెక్ట్ పూర్తయితే 4 లక్షల మందికి ఉపాధి.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారి మద్దతు మరువలేనిది.
రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటక రంగం చాలా కీలకమని, ఈ రంగంలో యువతకు ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చ’ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.
పర్యాటక కేంద్రాలకు పునరుజ్జీవం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అలాగే గోదావరి, కృష్ణా, వంశధార వంటి నదీ తీరాలు ఉన్నాయి. మిగతా దేశాల్లో అయితే హోటళ్లు, రెస్టారెంట్లు వంటివి పెట్టి అభివృద్ధి చేస్తారు. మన దేశంలో మాత్రం నదులు మన జీవన విధానం, సంస్కృతిలో భాగం. అందుకే అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పుష్కరాల రేవును ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఘాట్ లో ఉన్న ఆలయాల విశిష్టత తెలియజేసేలా ఏర్పాట్లు చేయడంతో పాటు గోదావరి హారతి ఇచ్చేలా తీర్చిదిద్దుతాం.
హేవలాక్ వంతెనకు 127 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిడ్జ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని దశాబ్ధాలుగా ఉన్న ఆకాంక్షను సాకారం చేస్తున్నాం. రాజహేంద్రవరం చరిత్ర, విశిష్టతలు, కళారంగాలు ఇలా వివిధ థీమ్ లతో అభివృద్ధి చేస్తున్నాము. వీటితో పాటు చుట్టుపక్క ప్రాంతాలను అభివృద్ధి చేసి 2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించేలా అఖండ గోదావరి ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నాం” అన్నారు.