టాటా మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ SUV, టాటా హారియర్ EV భారతదేశంలో అధికారికంగా జూన్ 3, 2025న విడుదలయ్యింది. టాటా హారియర్ EV రూ. 21.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. దీని బుకింగ్స్ జులై 2, 2025 నుండి ప్రారంభమయ్యాయి. ఇది ఐదు వేరియంట్లలో లభిస్తుంది . అవి ప్యూర్, క్రియేటివ్, ఎఫిషియెంట్, ఎంపవర్డ్, మరియు ఎంపవర్డ్ ప్లస్ అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది.
టాటా హారియర్ EV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. 65 kWh మరియు 75 kWh లో లభిస్తుంది. 65 kWh బ్యాటరీ ప్యాక్ లో దాదాపు 235 BHP శక్తిని అందిస్తుంది. 75 kWh బ్యాటరీ ప్యాక్ లో 390 bhp శక్తిని మరియు 504 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ 75 kWh వేరియంట్ లో వంద కిలోమీటర్స్ వేగాన్ని 6.3 సేకండ్స్ లో చేరుకుంటుంది. ARAI ధృవీకరించిన ప్రకారం, 75 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ ఒక్కసారి ఛార్జింగ్‌తో 627 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. నిజ జీవితంలో ఇది 480-505 కి.మీ ఇస్తుంది అని అంచనా వేయవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ చార్జర్ తో హారియర్ EV ని 20 నిమిషాలు ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్స్ ప్రయాణించవచ్చు.
అంతే కాకుండా టాటా హారియర్ ఇపుడు 4 వీల్ డ్రైవ్ మరియు 2 వీల్ డ్రైవ్ వేరియంట్ లో మొదటి సారిగా లభిస్తుంది. టాటా మోటార్స్ తొలిసారిగా 14.5 అంగుళాల శామ్‌సంగ్ కంపెనీ నుండి నియో క్యూఎల్‌ఈడీ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను ఉపయోగించింది .ఇది జేబీఎల్ బ్లాక్ సౌండ్ సిస్టమ్ 10 స్పీకర్ సిస్టమ్ తో డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీ ఉపయోగించింది. డ్రైవర్ వ్యూ డిస్ప్లే 12.25 అంగుళాల పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది . 360 డిగ్రీల కెమెరా ప్లేస్ లో మొట్టమొదటి సారిగా 540 డిగ్రీల కెమెరా వ్యవస్థ బ్లైండ్‌స్పాట్ మానిటరింగ్‌తో టాటా మోటార్స్ అందిస్తుంది. అదే విధంగా సేఫ్టీ ద్రుష్టి లో పెట్టుకుని 28 GB స్టోరేజ్ సామర్థ్యం కలిగిన బిల్ట్-ఇన్ డాష్‌క్యామ్ ని అందిస్తుంది .డాష్‌క్యామ్ లో వీడియోస్ ని QR కోడ్ ఆధారంగా మన మొబైల్ లో పొందవచ్చు.
కొత్త టాటా హారియర్ EV లో ఆరు డ్రైవింగ్ మోడ్‌లు వున్నాయి .శాండ్, రాక్ క్రాల్, బూస్ట్ మోడ్, ట్రాన్స్‌పరెంట్ మోడ్, డ్రిఫ్ట్, మరియు ఆఫ్-రోడ్ అసిస్ట్. కొత్తగా ట్రాన్స్‌పరెంట్ మోడ్‌లో వాహనం కింద రోడ్డును స్క్రీన్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ ఫీచర్ మనకు ఆఫ్-రోడ్ డ్రైవింగ్ చేస్తున్నపుడు ఎంతగానో సహాయపడుతుంది. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, NFC కార్డ్‌లను ఉపయోగించి డిజిటల్ కీ యాక్సెస్ తో కార్ ని అన్లాక్ మరియు లాక్ చేయవచ్చు.
ఆటోపార్క్,వెనుక ప్రయాణీకులకు సన్ షేడ్స్, పవర్డ్ టెయిల్‌గేట్, ఎలక్ట్రిక్ బాస్ మోడ్ స్విచ్ దీనిని ఉపయోగించి వెనుక సీటు నుండి ముందు సీటును సర్దుబాటు చేయవచ్చు .ఈ లాంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఇది 502 లీటర్ల బూట్ స్పేస్ మరియు బ్యాక్ సీట్స్ ని ఫ్లోడ్ చేయడం వల్ల 999 లీటర్ల వరకు విస్తరించవచ్చు. కార్ ముందు భాగం లో 35 లీటర్ల ఫ్రంక్ స్టోరేజ్ లభిస్తుంది.
వారంటీ విషయానికి వస్తే టాటా మోటార్స్ ఈ కారులో ఉన్న బ్యాటరీ ప్యాక్‌కు జీవితకాల వారంటీని ప్రకటించింది. మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం, ఇది కారు మొదటిసారి RTOలో నమోదు చేసుకున్న తేదీ నుండి 15 సంవత్సరాల వరకు జీవితకాల వారంటీని సూచిస్తుంది.