రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోమవారం కృష్టా జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10 గం.లకి కంకిపాడు మండలం గుడువర్రు గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామం చేరుకుంటారు. అక్కడ రక్షిత తాగు నీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలిస్తారు.