ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాల పై చర్చించారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని ప్రధానిని కోరారు. అలాగే రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్‌లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని విడుదల చేయాలని కోరారు. విశాఖ రైల్వేజోన్ శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించారు.