రైల్వేలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 1036 పోస్టులకు అభ్యర్థులను నియమించనున్నారు.

రైల్వేలో రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వేస్ మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి బంపర్ రిక్రూట్‌మెంట్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 1036 పోస్టులకు అభ్యర్థులను నియమించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 7, 2025న ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 6న ముగుస్తుంది. రైల్వే రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా పీజీటీ టీచర్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, సైంటిఫిక్ అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

రైల్వే రిక్రూట్ మెంట్‌కు అప్లై చేయడానికి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఉండాలి. టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే బీఈడీ/డీఎల్ఈడీ/బీఈడీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.500గా ఉంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి రూ.250గా ఉంటుంది. అప్లికేషన్‌ను అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫిల్ చేయెుచ్చు.