భారతదేశంలో ఎక్కువ మంది ఇంజినీర్ లేదా డాక్టర్ కావాలని కోరుకుంటున్నారు. ఎక్కువ అవకాశాలు, భారీ శాలరీలు లభిస్తుండటంతో ఇంజినీరింగ్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. అయితే ఈ రంగంలో సెటిల్ అవ్వడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. అవే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (BE), బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech) కోర్సులు. ఈ రెండు డిగ్రీలు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ, కోర్సుల స్ట్రక్చర్ వేర్వేరుగా ఉంటుంది.
కోర్సు డ్యూరేషన్ : BE మరియు B.Tech రెండూ నాలుగు సంవత్సరాల ప్రోగ్రామ్స్. రెండింటినీ ఎనిమిది సెమిస్టర్లుగా విభజిస్తారు. వీటి మధ్య తేడా, ఈ డిగ్రీలు ఫోకస్ చేసే టాపిక్స్‌పై ఉంటుంది. BE (బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్) ఎక్కువ థిరిటికల్‌గా ఉంటుంది. దీన్ని ఇంజనీరింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్‌పై ఫోకస్ చేసే నాలెడ్జ్ బేస్డ్ కోర్సుగా పరిగణిస్తారు. సిలబస్ పెద్దగా అప్‌డేట్ అవ్వదు. NSIT, అన్నా వర్సిటీ, BITS పిలానీ వంటి కొన్ని పాపులర్ ఇన్‌స్టిట్యూట్‌లు BE కోర్సులను అందిస్తున్నాయి.
బీటెక్ :B.Tech (బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ) మరింత ప్రాక్టికల్, ఇండస్ట్రీ- ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఇది ఇంజినీరింగ్ కాన్సెప్ట్స్ అప్లికేషన్స్‌పై దృష్టి సారిస్తుంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్ జరుగుతుంటాయి. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ అప్‌డేట్ అవుతూ ఉంటుంది. B.Tech డిగ్రీలను IITలు, NITలు, DTU వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్లు ఆఫర్ చేస్తున్నాయి.
బీఈ : BE ఎక్కువగా థిరిటికల్ లెర్నింగ్‌పై ఫోకస్ చేస్తుంది. విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహన పొందుతారు. రీసెర్చ్, టీచింగ్‌పై ఆసక్తి ఉన్న వారు బీఈ డిగ్రీ ఎంచుకోవచ్చు. అయితే B.Tech ప్రాక్టికల్ నాలెడ్జ్, టెక్నాలజీ అప్లికేషన్లపై దృష్టి పెడుతుంది. రియల్-వరల్డ్ ప్రాజెక్ట్‌లలో తమ స్కిల్స్ అప్లై చేస్తూ, ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో పని చేయాలనుకునే విద్యార్థులకు ఈ డిగ్రీ సరిపోతుంది.
BE, B.Tech స్ట్రక్చర్ భిన్నంగా ఉన్నప్పటికీ, జాబ్ మార్కెట్‌లో రెండు డిగ్రీలకు సమానంగా విలువ ఉంది. వాటి వ్యాల్యూలో పెద్దగా తేడా లేదు. కెరీర్ అవకాశాల విషయానికి వస్తే రెండూ సమానంగానే ఉంటాయి.