శ్రీకాకుళం పట్టణంలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారు ‘గ్రో’ అనే కార్యక్రమం ద్వారా ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ ద్వారా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించి వారికి ఉద్యోగ కల్పన కూడా చేపడుతున్నారు.
డాక్టర్ రెడ్డీస్ ‘గ్రో’ : శ్రీకాకుళం పట్టణంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారి గ్రో ఆఫీసు నందు ఉచితంగా శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. వీటికి అర్హులు 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు వయస్సు కలిగిన విద్యార్థినీ విద్యార్థులు పదవ తరగతి పాస్ అయిన దగ్గర్నుంచి డిగ్రీ చదివే విద్యార్థులు, ఐటిఐ చేసిన విద్యార్థులు ఎవరైనా ఉద్యోగం కావాలి అనుకునే వారికి ఉద్యోగంలో అవసరమైన ఇంటర్వ్యూ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఆప్టిట్యూడ్ లాంటి డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఉచితంగా శిక్షణను ఇచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన కూడా జరగబోతుంది .