భారతదేశంలో చలికాలం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఈ సీజన్‌లో వాతావరణ మార్పుల కారణంగా శరీరంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చాలామందికి పెదవులు పగులుతాయి. చలి కారణంగా సరిగా వాటర్ తాగకపోవడం, ఎండలో ఎక్కువ సమయం ఉండటం, ఇతర కారణాలతో కూడా ఇలా జరగవచ్చు. అయితే చర్మ సంరక్షణ మాదిరిగా లిప్ కేరింగ్‌పై కూడా దృష్టి పెట్టాలి. అప్పుడే పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి.
చలికాలంలో గాలిలో తేమ ఉండదు. ఈ చల్లని, పొడి గాలి పెదవుల సున్నితమైన చర్మం నుంచి తేమను దూరం చేస్తుంది. దీంతో అవి పొడిబారి పగుళ్లు వస్తాయి. పెదవుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. సరైన లిప్ కేర్ రొటీన్ ఫాలో అవ్వకపోతే ప్రాబ్లమ్ మరింత పెరగవచ్చు. ఎండలో ఎక్కువ సమయం ఉంటే UV కిరణాల కారణంగా పెదవులు పగలవచ్చు. స్మోకింగ్ కూడా ఒక ప్రధాన కారణం. చలికాలం తగినంత నీరు తాగకపోవడం వల్ల చర్మం, పెదవులు పొడిబారిపోతాయి. విటమిన్ బి, ఐరన్ ఇతర పోషకాల లోపం సాల్టీ, మసాలా ఫుడ్స్ అతిగా తినడం వల్ల కూడా పెదవులు పగలవచ్చు. అయితే కొన్ని ప్రొడక్ట్స్ వాడితే ఈ సమస్య దూరం అవుతుంది.
చలికాలం పెదవులు పగలకుండా ఉండాలంటే, రోజూ హైడ్రేటింగ్ లిప్ బామ్ వాడాలి. షియా బటర్, సిరమైడ్స్, గ్లిజరిన్ లేదా హైలురోనిక్ యాసిడ్ వంటి హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న లిప్ బామ్ సెలక్ట్ చేసుకోవాలి. ఇవి పెదవులపై తేమను లాక్ చేసి, లిప్స్‌ను ఆరోగ్యంగా మారుస్తాయి. అయితే ఆల్కహాల్, మిథనాల్, ఫ్రాగ్నెన్స్‌లు, ఇతర డ్రైయింగ్ ఏజెంట్స్ లేని ప్రొడక్ట్స్ సెలక్ట్ చేసుకోవాలి. వారానికి మూడు సార్లు లిప్ మాస్క్ అప్లై చేయండి. ఇది పెదవులకు హైడ్రేషన్, పోషణ అందించి, వాటి రూపాన్ని మెరుగుపరుస్తుంది. పెదవులపై డెడ్ స్కిన్‌ను రెగ్యులర్‌గా తొలగించాలి. ఎక్స్‌ఫోలియేషన్‌తో లిప్స్ హెల్తీగా మారుతాయి. ఇందుకు స్పెషలైజ్డ్ లిప్ స్క్రబ్‌ను వారానికి 2 నుండి 3 సార్లు వాడాలి. పెదవుల సున్నితమైన చర్మంలో మెలనిన్ ఉండదు. దీనివల్ల ఎండకు ఎక్స్‌పోజ్ అయితే లిప్ స్కిన్ దెబ్బతింటుంది. కాబట్టి ఎండలో ఎక్కువగా పని చేసేవారు SPF 15 లిప్ బామ్ వాడాలి. స్పోర్ట్స్, ఔట్ డోర్ యాక్టివిటీస్‌లో పాల్గొనే వారు SPF 30 లేదా SPF 50 ఉన్న లిప్ బామ్స్ వాడటం మంచిది.