యూస్ ఎలెక్షన్స్ 2024 :
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే 270 కంటే ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లను పొందాలి. ఆ దేశ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం ఖరారైంది. మ్యాజిక్ ఫిగర్ 272 ఎలక్టోరల్ ఓట్లు దాటడంతో ఆయన గెలుపు ప్రకటన వెల్లడైంది. సర్వేలన్నీ ట్రంప్ కు వ్యతిరేకంగా వచ్చినా అగ్రరాజ్య ప్రజలు మాత్రం డొనాల్డ్ ట్రంప్ పై నమ్మకం ఉంచారు. ఓట్లేసి గెలిపించారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కేవలం 224 ఎలక్టోరల్ ఓట్ల తేడాతో వెనుకబడ్డారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ ట్రంప్ ముందంజలో ఉండగానే విజయం ఖాయమైంది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన ఇద్దరు విజయం సాధించారు. ఉపాధ్యక్షుడు కాబోతున్న జేడీ వ్యాన్స్ కూడా తెలుగు సంతతికి చెందిన అమ్మాయిని పెళ్లాడిన వ్యక్తి కావడంతో ఇప్పుడు ట్రంప్ కు భారతీయ ఓటర్ల మద్దతు కూడా బాగా పెరిగిందని తెలుస్తోంది.
78 ఏళ్లలో రెండోసారి ప్రెసిడెంట్ పదవిలో ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు భారతీయ సంతతికి చెందిన అభ్యర్ధులు కూడా గెలుపొందారు. ఉత్తర వర్జీనియాలోని 10వ జిల్లాలో భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థి సుహాస్ సుబ్రమణ్యం విజయం సాధించారు. ఈయన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా పనిచేశారు. అదేవిధంగా ఇల్లినాయిస్‌లో భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి మళ్లీ విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి మార్క్ రైస్ కంటే ఒక శాతం ఎక్కువ 57 పాయింట్లతో అతను రేసులో విజయం సాధించాడు.
మోడీ విషెస్ :
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించి భారత ప్రధాని X లో పోస్ట్ చేస్తూ, చరిత్రాత్మక ఎన్నికల విజయానికి నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు అని పేర్కొన్నారు.