ఏపీలో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈరోజు నుంచి దీపం పథకం మొదలుకానున్న నేపథ్యంలో మరో పథకంపై మంత్రి గుడ్‌ న్యూస్ చెప్పారు. సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామని.. ఇక దీపం పథకాన్ని మొదలు పెడుతున్నామని తెలిపారు. అలాగే సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు