బంగారాన్ని డిజిటల్ రూపంలో కొనడం చాలా లాభదాయకం. గోల్డ్ ఫిజికల్ గా కాకుండా, డిజిటల్ రూపంలో కూడా కొనవచ్చు. డిజిటల్ గోల్డ్ కొనడం చాలా ఈజీ. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రస్తుత మార్కెట్ ధరలో సులభంగా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ బంగారం కొనుగోలు చేసేటప్పుడు స్వచ్ఛత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ప్రస్తుత మార్కెట్ ధరలో డిజిటల్ బంగారాన్ని కొనడానికి లేదా విక్రయించడానికి వీలు ఉంటుంది.
డిజిటల్ గోల్డ్ : డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయడంలో చాలా వెసులుబాటు ఉంటుంది. రోజుకు రూ.1 లేదా రూ.2,00,000కి కొనుగోలు చేయవచ్చు. అయితే, మీరు డిజిటల్ బంగారం అనేది కాగితంపై లేదా ఎలక్ట్రానిక్ రూపంలో మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోవాలి. డిజిటల్ బంగారం కూడా భౌతిక బంగారం లాగే , ధర మార్కెట్‌తో హెచ్చుతగ్గులకు గురవుతుంది. ధర పెరగవచ్చు లేదా తగ్గవచ్చు కూడా. అలాగే, నిల్వ లేదా దొంగతనం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ తరపున విక్రేతలు జాగ్రత్త తీసుకుంటారు. డిజిటల్ బంగారం లిక్విడేట్ చేయడం చాలా సులభం. ఇది UPI ద్వారా ఎవరికైనా డబ్బు పంపినంత సులభం. వాస్తవానికి, కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులు తమ డిజిటల్ బంగారాన్ని భౌతిక బంగారంగా మార్చుకోవడానికి కూడా అనుమతిస్తాయి. అయితే కొన్ని షరతులు ఉంటాయి.
భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు, అది 22 క్యారెట్ లేదా 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. అదే మీరు డిజిటల్ బంగారం కొనుగోలు చేసినప్పుడు అది 24 క్యారెట్ లేదా 100 శాతం స్వచ్ఛమైనది. MMTC-PAMP ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ గోల్డ్ డీలర్. అలాగే మీరు ఈ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
భారతదేశంలో డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయడానికి Google Pay, Paytm, PhonePe, Jio లాంటి డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లు యాప్‌ల ద్వారా కూడా డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు.