తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నూతన మద్యం పాలసీ 2024-2026 ప్రకారం లాటరీ పద్ధతిలో షాపు లకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం చెయ్యడం జరిగింది.. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

జాయింట్ కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిలో ప్రక్రియ ప్రారంభం

జిల్లా పరిధిలో 125 షాపులు కోసం అభ్యర్థులు చేసుకున్న 4384 దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ అనుసరించి తొలుత రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని షాపుల లాటరీ ప్రక్రియ ప్రారంభం

తదుపరి మండలాలు , మున్సిపాలిటీ వారీగా అక్షర క్రమంలో మండలాల వారీగా లాటరీ పద్ధతిలో షాపులు కేటాయింపు జరపనున్నాం

ఈ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎక్సైజ్ , రెవిన్యూ పోలీసులు అధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు

లాటరీ పద్ధతిని పర్యవేక్షణా కోసం జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా మద్యం అబ్కారీ అధికారి సి హెచ్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.