నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. సింహా (2010), లెజెండ్ (2014) తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో 2021లో వచ్చిన అఖండ హ్యాట్రిక్ విజయంతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది.
ఇప్పుడు అఖండ కు కొనసాగింపుగా “”అఖండ 2 – తాండవం” రాబోతుంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో ఇది నాలుగో సినిమా. తమన్ సంగీతం అందించబోతున్న ఈ చిత్రాన్ని ’14 రీల్స్’ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తుండగా, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.