భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ రూల్స్ మార్చేసింది. ఇకపై అడ్వాన్స్‌గా టికెట్ బుక్ చేసుకునేవారికి కొత్త రూల్స్ అమలు అవుతాయని తెలుస్తోంది. సోర్సుల ప్రకారం ఇకపై అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌ని 60 రోజుల ముందు నుంచి మాత్రమే చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇదివరకటి లాగా 120 రోజుల ముందు నుంచే బుక్ చేసుకునే వీలు లేనట్లే. అందువల్ల ఇకపై ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే 2 నెలల ముందు నుంచి మాత్రమే బుక్ చేసుకోవచ్చు.

ఈ కొత్త రూల్ నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోర్సుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్నవారికి ఈ కొత్త రూల్స్ వల్ల ఎలాంటి ప్రభావమూ పడదు. అందువల్ల ఇప్పటికే బుక్ చేసుకున్నవారు తమ ప్లాన్ ప్రకారం ప్రయాణించవచ్చు.

రైల్వే ఈ నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణం ఉంది. చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. కానీ ప్రయాణానికి 4 నెలల టైమ్ ఉండటంతో మధ్యలో అనుకోని కారణాల వల్ల టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దాంతో వారికి పూర్తి మనీ రిటర్న్ రావట్లేదు దాని వల్ల నష్టపోతున్నారు అని అందుకే రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది .