కొన్ని సింపుల్ టిప్స్‌తో కారు మైలేజీని పెంచుకోవచ్చు. అదే విధంగా కార్ ని సరిగ్గా మెయింటైనెన్స్ చేయడం వల్ల కూడా మైలేజ్ ని పెంచవచ్చు.

కారు టైర్ల ఎయిర్ ప్రెషర్ బట్టి కూడా మైలేజ్ ఆధారిపడి ఉంటుంది . కారు టైర్ల ఎయిర్ ప్రెషర్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయాలి. తక్కువ ఎయిర్ ప్రెషర్ మైలేజీని తగ్గిస్తుంది. టైర్లలో గాలి తగ్గితే కారు కష్టంగా నడుస్తుంది, ఫలితంగా పెట్రోల్ ఎక్కువగా ఖర్చవుతుంది.

కార్ యాక్సిలరేషన్ ఇచ్చే దాన్నిబట్టి కూడా మైలేజ్ ఆధారపడి ఉంటుంది. అదే విధంగా ఏసీ సెట్టింగ్స్ బట్టి కూడా ఆదారపడి ఉంటుంది. కారు ఇంజన్ నుంచే ఏసీ పవర్ తీసుకుంటుంది, ఏసీ చాలా తక్కువ టెంపరేచర్‌కి సెట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ పెట్రోల్ త్వరగా ఖర్చవుతుంది. ఇంజన్‌పై అదనపు భారం పడుతుంది. అందుకే ఏసీ వీలైనంతవరకు హై టెంపరేచర్‌లోనే ఉంచుకోవాలి. మరీ లో టెంపరేచర్స్‌కి పెట్టుకోవద్దు. కార్ ఇంజన్ మెయింటనెన్స్ సరిగ్గా చూసుకోవాలి, కారుకు రెగ్యులర్‌గా సర్వీస్‌ చేయించడం మరియు ఎయిర్ ఫిల్టర్‌ని క్లీన్‌గా ఉచ్చడం వల్ల పెట్రోల్ తక్కువగా ఖర్చవుతుంది. కారు విండోస్ ఓపెన్ చేసి నడిపితే కారులోకి ఎక్కువ గాలి ప్రవేశిస్తుంది. దేని వల్ల ఇంజన్‌పై ఎక్స్‌ట్రా లోడ్ పడుతుంది . ఫలితంగా పెట్రోల్ ఎక్కువగా ఖర్చవుతుంది.