ఆటోమొబైల్ మార్కెట్ లోకి మరో టాటా కొత్త కార్ ఎంట్రీ ఇచ్చింది. టాటా కర్వ్ ఐస్ పేరుతో రాబోతున్న ఈ కారులో అబ్బురపరిచే ఫీచర్స్ ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

టాటా మోటార్స్ ఇటీవలే టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఆవిష్కరించింది. తాజాగా ఇదే మోడల్ నుంచి టాటా కర్వ్ ICE అంటూ మరో వర్షన్ మార్కెట్ లోకి తెచ్చింది.

సెప్టెంబర్ 2న విడుదల చేసిన టాటా కర్వ్ ICEలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ రెండు వేరియంట్లలో ఈ SUV అందుబాటులోకి వచ్చింది. రూ.10 లక్షల నుంచి ప్రారంభమవుతున్న ఈ కారు అత్యాధునిక ఫీచర్లతో రంగంలోకి వచ్చింది. మూడు ఇంజిన్‌ ఆప్షన్స్‌, మల్టిపుల్ గేర్‌బాక్స్ ఇందులోని ప్రత్యేకత.ఈ కారు స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకాప్లిష్డ్ అనే నాలుగు ట్రిమ్ స్థాయిల్లో అందుబాటులో ఉంది.

ఇకపోతే ఇందులో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ సిస్టమ్ ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, 9 స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్‌, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ ఉంటాయి. సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్‌ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కార్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ 31 వరకు బుకింగ్స్ ఉంటాయని టాటా కంపెనీ పేర్కొంది.