ఈ రోజు బంగ్లాదేశ్ తో కాన్పూర్లో జరిగిన రెండవ టెస్ట్ నాలుగో రోజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా 27,000 అంతర్జాతీయ పరుగులు సాధించిన బ్యాటర్ గా సచిన్ రికార్డును అధిగమించాడు.

సచిన్ టెండూల్కర్ ఈ మైలురాయిని 623 ఇన్నింగ్స్ లో అందుకోగా, విరాట్ కోహ్లీ కేవలం 594 ఇన్నింగ్స్ లోనే 27,012 పరుగులు సాధించాడు. తర్వాత స్థానాల్లో కుమార సంగక్కర (648 ఇన్నింగ్స్), రికీ పాంటింగ్ (650 ఇన్నింగ్స్) ఉన్నారు.