చిరంజీవి, పవన్ కళ్యాణ్ కుటుంబంతో హాజరు
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గేమ్ చేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ రాజమహేంద్రవరం సమీపంలోని కడియం మండలం వేమగిరిలో జరగనుంది. జనవరి 4న ఈ వేడుక నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా తూర్పుగోదావరి పరిసర ప్రాంతాల్లో అధికంగా తీశారు. అంతేగాక గ్రామీణ ప్రాంతంలో ఈ ఈవెంట్ నిర్వహించడానికి చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఈవెంట్ కు హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ తో పాటు శ్రీ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిత్ర యూనిట్, సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేయనున్నట్లు తెలుస్తుంది.
వేమగిరిలోనే ఈ వేడుక ఎందుకు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందంటే నాలుగు లైన్ల జాతీయ రహదారిని ఆనుకుని ఆ గ్రామ మాజీ సర్పంచ్ వెలుగుబంటి వెంకటాచలంకు చెందిన సుమారు నలభై ఎకరాల స్థలం ఉంది. ఆ గ్రౌండ్లో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ తో పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు సభలను విజయవంతంగా నిర్వహించారు. ఈ గ్రౌండ్ ని అనుకుని పలు పార్కింగ్ స్థలాలతో పాటు ట్రాఫిక్ మళ్ళించడానికి అనుకూలంగా రహదారులు ఉన్నాయి. అందుకునే ఈ వేడుకలను ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మంగళవారం పలువురు గ్రౌండ్ పరిశీలన జరిగింది.