పుష్ప 2 సినిమా ప్రభంజనం తొలి రోజు నుంచే షురూ అయింది. మూడు రోజులో 621 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ వసూళ్లతో అల్లు అర్జున్ తన పేరిట సరికొత్త రికార్డు క్రియేట్ చేసుకున్నారు.
పుష్ప రూపంలో అల్లు అర్జున్ వీరవిహారం చేస్తున్నారు. బన్నీ మాస్ అవతారం అన్ని వర్గాల ఆడియన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.