ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సామాన్యులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. దీని వల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని అనుకోవచ్చు. తూర్పు గోదావరి జిల్లాలో ఆధార్ స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తోంది. అందువల్ల ఎవరైనా ఆధార్ కార్డు పొందాలని భావిస్తే ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సర్వీసులు కేవలం పిల్లలకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 6 ఏళ్ల వరకు ఉన్న వారు ఆధార్ నమోదు చేసుకోవచ్చు.
కాగా ఈ ఆధార్ స్పెషల్ డ్రైవ్‌లు ఈ రోజు నుంచే ప్రారంభం అవుతాయి. 10వ తేదీ వరకు జరుగుతాయి. అందువల్ల మీరు మీ పిల్లలకు ఆధార్ కార్డు పొందాలని భావిస్తే ఈ సేవలు వినియోగించుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ ఆధార్ క్యాంపులు జరుగుతాయి. మీకు ఈ ఆధార్ స్పెషల్ డ్రైవ్స్ గురించి తెలియాలంటే దగ్గరిలోని సచివాలయాలకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.