గత కొన్ని నెలల నుండి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కాంట్రిబ్యూషన్లు భారీగా పెరిగాయి. లాంగ్ టర్మ్‌లో తక్కువ మార్కెట్ రిస్కు, ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ఉండటంతో మ్యూచువల్ ఫండ్స్ పాపులర్ అయ్యాయి.
భారతదేశంలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి అనేక ఆప్షన్లు ఉన్నాయి. అయితే నష్టభయం ఉన్న వాటి నుంచే రాబడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువ రిస్క్ ఉండే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి భయపడే వారికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఇవి కూడా మార్కెట్ పరిస్థితులకు లోబడి ఉంటాయి. కానీ షేర్ మార్కెట్ అంత నష్టభయం ఉండదు. లాంగ్ టర్మ్‌లో తక్కువ మార్కెట్ రిస్కు, ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ఉండటంతో మ్యూచువల్ ఫండ్స్ పాపులర్ అయ్యాయి. అయితే గత కొన్ని నెలలుగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కాంట్రిబ్యూషన్లు భారీగా పెరిగాయి.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) డేటా ప్రకారం, సిప్ ఇన్వెస్ట్‌మెంట్లు ఆగస్టులో రూ.23,547.34 కోట్ల నుంచి రికార్డు స్థాయిలో రూ.24,508.73 కోట్లకు పెరిగాయి. ఒక నెలలోనే 4% పెరుగుదల నమోదైంది. సిప్ కాంట్రిబ్యూషన్‌లు రూ.24,000 కోట్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి.
పెరిగిన సిప్ అకౌంట్లు మరియు అసెట్స్ : కాంట్రిబ్యూషన్లతో పాటు, ఎక్కువ మంది కొత్త సిప్ అకౌంట్‌లు ఓపెన్ చేస్తున్నారు. ఒక్క సెప్టెంబర్‌లోనే 6.64 మిలియన్ల కొత్త సిప్ అకౌంట్‌లు క్రియేట్ అయ్యాయి. సిప్‌ల కింద అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM) విలువ కూడా రూ.13.81 లక్షల కోట్ల ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. ఆగస్టులో 96.14 మిలియన్ల సిప్ అకౌంట్‌లు ఉండగా, సెప్టెంబరుకు వీటి సంఖ్య రికార్డు స్థాయిలో 98.74 మిలియన్లకు పెరిగింది. ఇండివిడ్యువల్ అకౌంట్లను సూచించే మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు కూడా సెప్టెంబర్‌లో ఆల్ టైమ్ హై 210.5 మిలియన్లను తాకాయి.